సూపర్ స్టార్ మహేష్‌బాబు తన 25వనిమా కోసం కొత్త ప్రయోగాలను చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీపైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనీదత్‌లు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా, ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు విభిన్నమైన కొత్త లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. వాటిలో ఒకటి స్టూడెంట్ లుక్. ఈ లుక్ కోసం మహేష్ బాబు ఇప్పటికే కొంత బరువు తగ్గగా.. ఫిట్ నెస్ కోసం ఇప్పటి నుంచే కసరత్తులు మొదలు పెట్టారు. ఇందు కోసం గతంలో ఎన్టీఆర్ అరవింద సమేత చిత్రంలో సిక్స్‌ప్యాక్‌లో కనిపించేందుకు వ్యక్తిగత కోచ్‌ను పెట్టుకుని కష్టపడినట్టే మహేష్‌బాబు కూడా కష్టపడుతున్నారు.
see also:పవన్‌తో పరిచయం కొనసాగుతుంది..!
ఇప్పటికే ట్రైనింగ్ సెషన్స్‌ను మొదలు పెట్టిన మహేష్ బాబు.. అవుట్‌డోర్ లొకేషన్స్‌లో కూడా ట్రైనర్‌ను వదలడం లేదట. ఫుల్ ఫిట్‌తోనే సెట్స్‌లోకి అడుగు పెట్టాలనే దృఢ సంకల్పంతో మహేష్‌బాబు కష్టపడుతున్నారు. ఇలా చిత్రం కోసం నిరంతరం కష్టపడుతున్న మహేష్‌బాబును చూస్తుంటే.. మరికొద్ది రోజుల్లోనే బాడీని బిల్డ్ చేయగలరని తెలుస్తోంది.