జూరాల సోర్స్ నుండి నిర్మిస్తున్న నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా దాదాపు ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి వీలుగా అవసరమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖను ఆదేశించాఠు. తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం నుండి ఈ ఏడాదే మొదటి దశ పంపింగ్ ప్రారంభం కావాలని చెప్పారు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 87,500 ఎకరాల ఆర్డిఎస్ ఆయకట్టును వందకు వంద శాతం స్థిరీకరించగలుగుతామన్నారు.
see also:వ్యవసాయ కూలీలతో “కడియం”..!!
తుంగభద్ర నది నుండి నీటిని ఎత్తిపోసి ఆర్డీఎస్ కాలువలకు అందించే తుమ్మిళ్ల ఎత్తిపొతల పథకం పనులను ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు. తుంగభద్ర వద్ద ఇంటేక్ పాయింట్ ను, అప్రోచ్ కెనాల్ ను, పంప్ హౌజ్ లను పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, పంచాయతిరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, రాజ్యసభ ఎంపి కేశవరావుతదితరులు వున్నారు.
see also:తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త..
‘‘ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి వుండగా గత పదేళ్లుగా పూర్తి ఆయకట్టుకు నీరు రావడం లేదు. తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా పూర్తి ఆయకట్టుకు నీరందుతుంది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ‘‘తుమ్మిళ్లతో పాటు గట్టు ఎత్తిపోతల పథకాలు పూర్తయితే కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య వున్న నడిగడ్డలో లక్షా 20 వేల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయి’’ అని ముఖ్యమంత్రి అన్నారు. ‘‘జూరాల ద్వారా లక్షా నాలుగు వేల ఎకరాలు, నెట్టెంపాడు ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, భీమా ద్వారా రెండున్నర లక్షల ఎకరాలు, కోయిల్ సాగర్ ద్వారా 50 వేల ఎకరాలు, ఆర్డీఎస్ ద్వారా 87,500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించడానికి ఎత్తిపోతల పథకాలు నిర్మిస్తున్నాం. ఈ ప్రాజెక్టుల ద్వారానే తాగునీరు కూడా అందిస్తాం. నీటిని సమగ్రంగా వినియోగించుకోవడానికి ప్రస్తుతం నిర్మిస్తున్న రిజర్వాయర్లతో పాటు ఇంకా ఎన్ని రిజర్వాయర్లు అవసరమవుతాయే నిర్ధారించి, ప్రతిపాదనలు రూపొందించాలి. అవసరమైన పంపు హౌజ్ లు, కాలువల నిర్మాణం పూర్తి చేయాలి’’ అని ముఖ్యమంత్రి ఆదేశించారు.
see also:గద్వాల నడిగడ్డపై సీఎం కేసీఆర్ వరాల జల్లు
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం వివరాలు:
—————————————–
• రూ.783 కోట్ల వ్యయం
• 87,500 ఎకరాలకు సాగునీరు
ఈ సీజన్ నుంచి నీటి లిఫ్టింగ్
——————————-
• ఆర్డీఎస్ ద్వారా గద్వాల, ఆళంపూర్ నియోజకవర్గాల్లో 75 గ్రామాల్లోని 87,500 ఎకరాలకు సాగునీరు అందాలి. 15.9 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నది
see also:నర్సింగ్ అబ్బాయిలకు ఉన్నత చదువులకు అవకాశాలు కలిపించాలి
• కానీ గత పదేళ్లుగా కేవలం 31,500 ఎకరాలకు మాత్రమే నీరు అందుతున్నది. మిగతా 56వేల ఎకరాలకు సాగునీరు లేక బీడు బారి పోయింది
• కేవలం 5 టిఎంసిలు మాత్రమే ఉపయోగించుకోగలుగుతున్నాం. మిగతా 11 టిఎంసిలు అందడం లేదు
• ఈ గ్యాప్ ను పూడ్చడానికి మొత్తం 87,500 ఎకరాల భూమికి నీరు ఇవ్వడానికి రూ.783 కోట్ల వ్యయంతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం చేపట్టారు
see also:ఎమ్మెల్యే వార్తలపై స్పందించిన పోచంపల్లి..!!
• తుంగభద్ర నది నీళ్లు నిల్వ చేసే సుంకేసుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి తుమ్మిళ్ల గ్రామం వద్ద నీటిని లిఫ్ట్ చేసి, ఆర్డీఎస్ కెనాల్ లో నీరు పోస్తారు. దీంతో 56వేల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది
• రెండో దశలో మల్లమ్మకుంట, జులకల్, వల్లూరు రిజర్వాయర్లు నిర్మిస్తారు. ఒక టిఎంసి నీటిని రిజర్వ్ చేస్తారు
• ఈ సీజన్ లోనే సుంకేసుల నుంచి నీటిని పంప్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.