ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు రావడంతో రాజకీయ అప్పుడే వెడెక్కుతుంది. రాష్ట్ర రాజకీయాలు రివర్స్ గేర్‌లోకి మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు అధికార పార్టీ నుంచి చీమైనా కదలని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కొండలే కదిలిపోతున్నాయి. అది కూడా ఏ జనసేనలోకో.. కాదు.. కన్నా లక్ష్మీనారాయణ అభయం చూసుకుని బీజేపీలోకా.. అంటే అదీకాదు.. టీడీపీ నేతలు పొద్దున లేస్తే.. తిట్టి పోసే ప్రధాన, ఏకైక విపక్షం వైసీపీలోకి. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ విజయం అని తెలిసి భారీగా వలసలు వస్తున్నారని సమచారం. అయితే 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన 2019లో ఆమె గెలుపు గురించి ఓ వార్త సంచలనం రేపుతుంది. ఎవరు ఆ మహిళ ఎమ్మెల్యే అంటే…
see also:హ్యాట్సాఫ్ వైసీపీ ఎమ్మెల్యే పుష్పాశ్రీవాణి..!!
‘లక్ష్యం గొప్పదైనప్పుడు నడిచే దారిలో రాళ్లున్నా.. ముళ్లున్నా లెక్క చేయకు’ అని పెద్దలు చెప్పిన మాటలను మనసుకెక్కించుకున్న ఓ సాధారణ మహిళ. తనకు తెలియకుండానే మహానేత వై.ఎస్.రాజశేఖరెడ్డిపై అమితమైన అభిమానం పెంచుకుని… ఆ కారణంగానే పరీక్షిత్‌రాజ్‌ను పెళ్లి చేసుకుని వైఎస్ తనయుడు..ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్థాపించిన వైసీపీ పార్టిలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అటు ప్రజా ప్రతినిధిగా, రాజకీయనేతకు భార్యగా సమతూకం పాటిస్తూ ప్రజల ఆదరాభిమానాలు గెలుచుకుంటున్నారు. ఆమే కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి. మారుమూల గిరిజన పల్లెల్లో ప్రతి గడపా తొక్కారు. ప్రతి ఇంటి సమస్యా తెలుసుకున్నారు. వాటికోసం అవిశ్రాంతంగా పోరాడుతున్నారు. వైసీపీ అయితేనే పోటీ చేస్తాను, ఇంకేదైతే నో అని చెప్పి..పెళ్ళయిన 15 రోజులకే వైసీపీ కురుపాం నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమితులైనారు. మార్చి 14న పరీక్షిత్ రాజుతో పెళ్లయింది. నెల రోజులకే ఎలక్షన్ ప్రచారానికి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.
see also:పవన్ సంచలన ప్రకటన..కేసీఆర్‌ను త్వరలో కలుస్తా
అప్పటి నుండి చాలా మంది ఫోన్ చేసి ప్రలోభాలు ఎరవేసిన దేనికీ లొంగలేదు. ఆ సమయంలో వైఎస్‌పై మాకున్న అభిమానాన్ని చాటిచెప్పడం కోసం చేతిపై ‘వైఎస్‌ఆర్’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని నిలబడటం జగన్ నుంచే నేర్చుకున్నాం. ఆయన బాటలోనే నడుస్తూ ఆయన ప్రేమను పొందగలిగాం అంటున్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమం పుష్పశ్రీవాణి బాగా చేసానని జగన్ మెచ్చుకున్నారంటా. కార్యకర్తలు అలసిపోయేవారు, రిపోర్టర్స్ అలసిపోయే వారు కాని ఆమె మాత్రం 600 గడపలు తిరిగేసే..ఐదేళ్ళు కష్టపడితే తరువాత జగనన్న సీఎం అయితే చాలు అంతా హ్యాపీగా ఉంటాం అని ప్రజలతో చెబుతుంటారంట.
see also:7 రోజులు దీక్ష చేసి 7 కిలోల బరువు పెరిగిన సీఎం రమేష్..వైద్య చరిత్రలోనే ఇది అద్భుతం అంటున్న డాక్టర్లు..!
ఎమ్మెల్యేను ఇంట్లో అమ్మాయిగా చూస్తారు..
గిరిజన ప్రాంతాలకు వెళ్తుంటే వాళ్ళింట్లో అమ్మా యి ఎమ్మెల్యే అయినట్టు ఫీలవుతారంటా. వాళ్ళ మధ్యలోనే కూర్చొని భోజనం చేస్తారంటా. వాళ్ళ సమస్యలు వింటు..గడప గడపకు వెళ్ళడం, వారం రోజులు తిరగడం ఇదే నా పని వారికి సేవ చెయ్యడం తప్పా నాకు ఇంకా ఏం పని ఉంది అంటున్నారు ఎమ్మెల్యే. అంతేకాదు జియ్యమ్మవలస మండలం చినతోలిమంద గిరిజన ఏరియాలో నా వల్లే రోడ్డు వచ్చిందని అక్కడి వారంతా నాకు చీరలు పరిచి పుష్పశ్రీవాణిని తీసుకెళ్ళారు. కొమరాడ మండలం కల్లికోటకు వెళ్తే అక్కడి ఆడవాళ్ళు మాకు మంచినీటి సమస్య తీర్చమ్మా చాలు నిన్ను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం అనగానే ఆ ఊరికి రూ.34 లక్షలు విడుదల చేయించారు..అలాగే చినమేరంగిలో కూడా నీటిసమస్య తీర్చేందుకు రూ.25లక్షలు మంజూరు చేయించాను. ఇలా ఎన్నో చేస్తున్నాను. ఇవన్నీ ఒకెత్తయితే ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను , నా భర్త పరీక్షిత్ ఎంత దూరమైనా వెళ్లి వారికి అండగా ఉంటాం. ఈ రోజు మా నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా నా పేరు తెలియని వారుండరని ఎమ్మెల్యే అంటున్నారు. అందుకే 2014 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలిచా. వచ్చే ఎన్నికల్లో 30 వేల మెజార్టీ ఖాయం అంటున్నారు. అన్నది ఎమ్మెల్యే కాదు..ఆ నియోజక వర్గ ప్రజలే. నిజంగా పుష్పశ్రీవాణి గ్రేట్ అంటున్నారు వైసీపీ నేతలు.
see also:
భార్యగానూ సక్సెస్
వాణి నాకు భార్యగా దొరకడం నా అదృష్టం. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబం వాళ్లది. అయినప్పటికీ ఒక పరిపూర్ణ పొలిటీషియన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అమెలో ఉన్నాయి. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించడం, ఎవరికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడటం ఆమెకున్న మంచి లక్షణం. ఎమ్మెల్యేగా ప్రజల కోసం ఎంతగా తపిస్తుందో, భార్యగా నా కోసం అంతే బాధ్యతగా మెలుగుతుంది. నాకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేదు. తనను ఎవరేమన్నా పెద్దగా పట్టించుకోదు. నన్నెవరైనా చిన్న మాట అంటే మాత్రం అస్సలు ఊరుకోదు. జగన్‌ను సీఎం చేయడమే మా ఇద్దరి ఏకైక లక్ష్యం అంటున్నారు.