ఏపీ రాజకీయాల్లో ఆ కుటుంబానికి మంచి పేరు ఉంది.ఇటు ప్రకాశం అటు నెల్లూరు జిల్లాలో ఎవరికీ ఏ సమస్య వచ్చిన కానీ వారింటి తలపునే తడ్తారు. తమ దగ్గరకు వచ్చిన ఏ ఒక్కర్ని కాదనకుండా వారి సమస్యలను తీర్చి మేమున్నామనే భరోసానిస్తారు.వారే మాగుంట సుబ్బరామిరెడ్డి కుటుంబం.ఆయన ఆయన సతిమణీ పార్వతమ్మ,తమ్ముడు శ్రీనివాసులు రెడ్డి వైసీపీ పార్టీలో చేరతారు అని వార్తలు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి.
see also:బీపీ, షుగర్ ఉన్న సీఎం రమేష్ దీక్ష ఎలా చేస్తున్నారో తెలుసా..
మొదటి నుండి వారి కుటుంబం అతిపెద్ద బిజీనెస్ ఫ్యామిలీ. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు మాగుంట టీడీపీలో చేరారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున పోటి చేసి ఓడిపోయిన మాగుంట ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన గెలిచారు .ఎమ్మెల్సీగా గెలిస్తే మంత్రి పదవీ ఇస్తాను అని హమీ ఇచ్చి చంద్రబాబు మోసం చేయడంతో ఆయన వైసీపీ శ్రేణులతో టచ్ లో ఉన్నారు ..
see also:బెజవాడలో సీఎం కేసీఆర్ కు ఏపీ కేసీఆర్ అభిమానులు భారీ స్వాగతం ..!
ఈ క్రమంలో తనకు అత్యంత సన్నిహితుడైన వైసీపీ నేత బాలినేని శ్రీనివాస రెడ్డి ద్వారా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి ని కలిశారు.దీంతో రానున్న ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి జగన్ హామీ ఇవ్వడంతో ఆయన చేరిక ఖాయమైంది.
see also:వైసీపీ మహిళ ఎమ్మెల్యే చేతికి,,‘YSR’అని పచ్చబొట్టు..!
ప్రస్తుతం ఒంగోలు ఎంపీగా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఎమ్మెల్యేగా పోటి చేయడానికి సిద్ధమవ్వడంతో ఆయన చేరికకి ఎవరు నో చెప్పకపోవడంతో త్వరలోనే ఆయన కుటుంబమంతా జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు.మాగుంట కుటుంబం వైసీపీలో చేరనుండటంతో రానున్న ఎన్నికల్లో ప్రకాశం ,నెల్లూరు జిల్లాల్లో వైసీపీకి ఎదురుండదు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు…
see also: ఇచ్చిన మాట కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలెదురైనా తట్టుకుని శక్తి వైఎస్ జగన్ ఇచ్చాడు…మహిళ ఎమ్మల్యే