తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్ర్త చికిత్స జరిగిన విషయం విదితమే. దీంతో మంత్రి పోచారం ఆస్పత్రిలోనే ఉన్నారు.
see also:తెలంగాణలో అద్భుతమైన పుణ్యక్షేత్రాలు..సీఎం కేసీఆర్
ఆస్పత్రి నుంచే రైతు బీమా పథకంపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు.ఈ క్రమంలోనే మోకాలి చిప్ప మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని మంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్ గురువారం కలిసి పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోరుకోవాలని వారు ఆకాక్షించారు.