ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు ప్రజా రంజక పాలన చేస్తున్నారని, చంద్రబాబు ప్రవేశపెట్టే ప్రతీ సంక్షేమ కార్యక్రమం.. ప్రతీ పేదవాడికి చేరుతుందన్నారు. 2019లోనూ టీడీపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.
వైఎస్ జగన్ గురించి మాట్లాడుతూ.. జగన్ కరప్షన్ కింగ్ ఆఫ్ ఆంధ్రా అంటూ ఎద్దేవ చేశారు. ఇప్పటికీ ప్రతీ శుక్రవారం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఘనత జగన్‌కే చెందిందని ఎద్దేవ చేశారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంగాళాఖాతంలో కలిసిపోతుందంటూ వైసీపీ నేతలపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.