జేఎస్సార్ మూవీస్ బ్యానర్ పై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్క్రీన్ ప్లే, డైరెక్షన్‌లో నిర్మించిన ప్రేమెంత పనిచేసే నారాయణ పాటల సీడీని ప్రజా సంకల్పయాత్రలో భాగంగా అమలాపురం క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎదురులేని మనిషి, బంగారుబాబు, జగపతి, ఢీ అంటే ఢీ, వాళ్లిద్దరు ఒక్కటే, మనసుంటే చాలు, మా అన్నయ్య బంగారం సినిమాలకు డైరక్టర్‌గా చేశానన్నారు.
see also:పాదయాత్ర 200వ రోజు సందర్భంగా వైఎస్ జగన్ ట్విట్
తన కుమారుడు హరికృష్ణను హీరోగా తొలిపరిచయం చేయడమే కాకుండా, తాను తొలి సినిమా తీస్తున్నానని, దీనికి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేస్తున్నానన్నారు. శ్రీనివాసరావు సతీమణి సుచిత్ర ప్రొడ్యూసర్‌గాను, కో డైరెక్టర్‌గా చిప్పిలు వ్యవహరిస్తున్నారన్నారు. హరికృష్ణ పక్కన హీరోయిన్‌గా అక్షిత చేస్తుందన్నారు. ఈ సినిమాలో లవ్‌తో పాటు యాక్షన్, కామెడి, ఎంటర్‌టైన్‌మెంటుగా సాగుతుందన్నారు. ప్రేమెంత పనిచేసే నారాయణ సినిమాను రియల్ కథను ఆధారంగా తీసుకుని చిత్రీకరించామన్నారు. ప్రస్తుత కాలంలో లవర్స్‌కు మంచి మెసేజ్‌ను అందిస్తున్నామన్నారు.
see also:వేల మీటర్ల ఎత్తు నుండి దూకిన జగన్..!ఎందుకంటే..!
ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ పూర్తయిందని వచ్చే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. సినిమాలోని ఒక్క పాటను జగన్ వద్ద ఆవిష్కరించేందుకు హైదరాబాద్ నుంచి వచ్చామన్నారు. హీరో హరికృష్ణ మాట్లాడుతూ వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం ఉందన్నారు. తొలిసారిగా నటిస్తున్న సినిమా పాటలను జగన్‌తో ఆవిష్కరించాలనే ఆకాంక్షతో వచ్చామని చెప్పారు.