ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే త్వరలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరనున్నారా.. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీడీపీలో చేరి రాష్ట్రంలో నెల్లూరు జిల్లా కొవ్వురు అసెంబ్లీ నియోజకవర్గం నుండి గెలుపొందిన పొలంరెడ్డి శ్రీనివాస రెడ్డి వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లాలో చక్కర్లు కొడుతున్నాయి. శ్రీనివాస రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ వాది.అప్పటి ముఖ్యమంత్రి అయిన దివంగత వైఎస్సార్ కు అభిమాని.
see also:“2000”మందితో వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త”ఆర్కే”.
అయితే గత నాలుగేళ్ళుగా కింది స్థాయి టీడీపీ కార్యకర్తలతో కల్సి నియోజకవర్గ స్థాయి నేతలందరూ తనపై పలు కుట్రలకు తెర తీయడం.. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో విఫలమవుతున్నారు అని ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి పిర్యాదులు చేయడంతో ఆయన తీవ్ర మనస్థాపనికి గురయ్యారు.
see also:చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర..!
దీంతో పార్టీలో ఉండి పలు అవమానాలను ఎదుర్కోవడం కంటే పార్టీ మారడమే మంచిదని భావించిన శ్రీనివాస రెడ్డి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారు.వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు..తనకు బంధువైన మాజీ డీజీపీ దినేష్ రెడ్డి సహకారంతో ఆయన వైసీపీలో చేరుతున్నారు అని రాజకీయవర్గాల్లో గసగుసలు వినిపిస్తున్నాయి ..