సినీ నటుడు, దర్శకుడు ప్రకాష్ రాజ్‌ను హత్య చేసేందుకు భారీ కుట్ర జరిగినట్లు గౌరీ లంకేష్ కేసును విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(ఎస్ఐటీ) వెల్లడించింది. ఈ మేరకు కన్నడ మీడియాలో బుధవారం కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించిన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ఇలాంటి కథనాలను చూసి తాను ఎంతమాత్రం బెదిరిపోనని, భవిష్యత్‌లో మరింత దూకుడు పెంచి విద్వేషపూరిత రాజకీయాలపై పోరాడతానని ఆయన పేర్కొన్నారు.
see also:చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా కరెన్సీ ఎక్సేంజ్..!
కాగా, గౌరీ లంకేష్ హత్య కేసులో పలువురు రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ గతంలో ఆరోపణలు చేశారు. గౌరీ లంకేష్ తనకు మంచి స్నేహితురాలని ప్రకాశ్‌రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె నిజాయతీగా ఉండేవారని, తన హత్య చాలా బాధించిందని ఆయన అన్నారు.
Bengaluru: Gauri killers planned to eliminate actor Prakash Rai, reveals SIT probe https://t.co/a3AEfE5vZK ….Look at the narrative to silence voices.. my VOICE will grow more STRONGER now .. you cowards …do you think you will get away with such HATE POLITICS #justasking pic.twitter.com/tIZd5xoOvq
— Prakash Raj (@prakashraaj) June 27, 2018