జనసేన అధినేత, సినీనటుడు సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆయన ప్రజలతో మమేకం అయ్యేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ ఎపిసోడ్‌లో భాగంగా తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో ఉత్తరాంధ్ర మేధావులతో ‘జనస్వరం’ పేరిట చర్చ కార్యక్రమం చేపట్టారు. కుప్పం యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కేఎస్ చలం సమన్వయ కర్తగా వ్యవహరించగా ఈ సందర్భంగా పవన్ సహా పలువురు మేధావులు పాల్గొన్నారు.
see also:ఆసుపత్రి బెడ్ మీద నుంచే అధికారులతో మంత్రి పోచారం సమీక్ష..!!
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఎటు చూసినా పచ్చటి భూములు… జల వనరులు ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని పాలకులు కావాలనే నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న సహజ వనరులు, గనులపై కొందరి దృష్టిపడిందనీ, వీటిని దోచే పని మొదలైందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ పథకంలో భాగంగానే ఇక్కడ బతకలేని పరిస్థితులు సృష్టిస్తున్నారు అన్నారు. ఈ విషయాలు చూసే మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. వీరి కోపానికి సహేతుకమైన కారణాలు ఉన్నాయని స్పష్టం చేశారు.
see also:ఘనంగా బోనాల పండుగ..!!
ఈ ప్రాంతంలోని వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తామని ప్రకటించారు. ఇందుకోసం త్వరలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన కులాలను మళ్లీ బీసీల్లో చేర్చేలా మేధావులతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ కు వినతి పత్రం ఇస్తానని తెలిపారు. ఇక్కడి ప్రకృతి వనరులు దెబ్బ తినకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.