ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రొ.నాగేశ్వర్ మాట్లాడుతూ.. ఢిల్లీని ఎదిరించి నిలిచిన వాళ్లలో నాడు ఎన్టీఆర్, వైఎస్ఆర్ అయితే.. ఇప్పుడు ఆ ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. వైఎస్ జగన్ అంటే తన దృష్టిలో ఓ పోరాట యోధుడని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కారం చేసిన వ్యక్తి జగన్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరితంగా పెట్టిన కేసుల్లో వైఎస్ జగన్ నేరస్థుడు కాదని, కేంద్ర, రాష్ట్ర కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో జగన్ కీలక పాత్ర పోషించనున్నాడని ప్రొ.నాగేశ్వర్ పేర్కొన్నారు.
ఐదుకోట్ల ఆంధ్రుల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం, ప్రతీ ఆంధ్రుడు తలెత్తుకు జీవించగలిగేలా రాష్ట్రాన్ని పాలించగల సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు. అంతేకాకుండా, 2014 ఎన్నికల్లో జగన్ కనుక ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబులాగా మోసపూరిత హామీలు ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయి ఉండేవారన్నారు. ప్రజలను మోసం చేయడం జగన్‌కు తెలీదు. అందుకే చంద్రబాబు జగన్ మోసం చేసేందుకు సాహసించలేదన్నారు ప్రొ.నాగేశ్వర్. 2014 ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా.. కేవలం రెండు శాతం ఓట్లతో వైఎస్ జగన్ ఓడిపోయారని, 2014 నుంచి ఇప్పటికీ ఒక సమర్ధవంతమైన నాయకుడిగా, చంద్రబాబు సర్కార్ అవినీతిని ఎండగడుతూ, ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, సమస్యల పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్న వైఎస్ జగన్‌కే ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చే దమ్ము, ధైర్యం ఉన్నాయని చెప్పారు ప్రొ.నాగేశ్వర్.