గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో ఎంత చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాష్ట్ర పురోగతికి సంబంధించిన అంశాలపై ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతుంటారు. సీఎం కేసీఆర్ ఈనెల 15న ప్రధానిని కలిసి తెలంగాణ, ఏపీ కి ఇచ్చిన హామీలను అమలు చేయాలని 10 ప్రతిపాదనలు అందజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీని విషయంలో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. ఢిల్లీలో ఆయనతో భేటీ అయి పలు అంశాలు చర్చించారు.
see also:కాంగ్రెస్ లోకి డిఎస్..!!
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బయ్యారం, ఐటీఐఆర్ పై సంబంధిత మంత్రితో అదనపు సమాచారం ఇవ్వాలని గత సమావేశంలో సీఎం కేసీఆర్‌ను ప్రధాని మోడీ అడిగారు. సీఎం ఆదేశాలతో మరింత సమాచారం, వివరాలతో కూడిన నివేదిక అందించామని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏర్పాటు చేయాలని కోరామన్నారు. ఐటీఐఆర్ విషయంలో రాష్ట్రానికి సహకరించాలని కోరినట్లు మంత్రి వివరించారు.బయ్యారం ఉక్కు కర్మగారం పై కేంద్రం ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, చొరవను వివరించామని తెలిపారు. 15 వేల మంది గిరిజనులకు బయ్యారంతో ఉపాధి కలగనుందని తెలిపారు. ఒడిశాలోని బైలాడిల్లా నుంచి ఇనుప ఖనిజాన్ని బయ్యారానికి తరలించేందుకు అవసరమైన రైలు మార్గ నిర్మాణ వ్యయంలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
see also:ఢిల్లీలో మంత్రి కేటీఆర్..ప్రధాని మోడితో భేటి..!!
ఐటీ రంగంలో రాష్ట్రం ఎలా ముందుకు పోతుందో వివరమైన నివేదిక ఇచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. జాతీయ సగటులో తెలంగాణ రాష్ట్రం ఎక్కువగా ఉన్నదని ప్రధానికి తెలిపామని మంత్రి కేటీఆర్ వివరించారు.
Met with Hon’ble PM Sri @narendramodi Ji to handover additional information that he had sought from @TelanganaCMO with regard to Hyderabad ITIR (Information technology investment region) & an integrated steel plant promised by GoI at Bayyaram in Khammam#HarithaHaaram#Handlooms pic.twitter.com/SkJhgTZz3A
— KTR (@KTRTRS) June 27, 2018