వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న జగన్‌కు ఆ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు పాల్గొనడం చూసిన రాజకీయ విశ్లేషకులు.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి ఫిక్స్, జగన్ మదిలో ఆయన పేరు అంటూ ఓ కథనం వైరల్ అవుతోంది. ఆ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ముఖ్య నేతగా కొనసాగుతున్న చలమశెట్టి సునీల్‌కే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ ఎంపీ సీటు కేటాయించే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఆ క్రమంలోనే జగన్ తన పాదయాత్రలో కూడా చలమశెట్టి సునీల్‌కే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అంతేకాకుండా, జగన్ తన అనుచరులతో చేయించిన సర్వేలోనూ చలమశెట్టికి అనుకూలంగా ఫలితాలు వచ్చాయట. ప్రస్తుతం టీడీపీ తరుపున ఎంపీగా ఉన్న తోటా నరసింహంను ఓడించగల సత్తా ఉన్న నాయకుడు చలమశెట్టి అని, ఆ క్రమంలనే ఆయన్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ కేడర్ భావిస్తోంది.