విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చెయ్యకపోవడంతో సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో గాలి జనార్ధనరెడ్డి మీడియా ముందుకు వచ్చి సంచలన వాఖ్యలు చేశారు. గాలి జనార్ధనరెడ్డి, చంద్రబాబుకి ఓ ఆఫర్ ఇస్తున్నారు.. స్టీల్ ఫ్యాక్టరీ కోసం చంద్రబాబు కిందా మీదా పడాల్సిన అవసరం లేదని.. తనకి అవకాశం ఇస్తే, కేవలం రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టి చూపిస్తానంటూ గాలి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..
see also:7గురు వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా ..!కారణం ఇదే ..!
ఒకవేళ తాను చెప్పినట్లుగా రెండేళ్లలో బ్రాహ్మణి స్టీల్ ఫ్యాక్టరీని కట్టలేకపోతే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ విసిరారు.. బ్రాహ్మణి స్టీల్ కోసం తాను ఇప్పటివరకూ రూ.1350 కోట్లు పెట్టుబడి పెట్టానని చెప్పిన గాలి.. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే స్టీల్ ఫ్యాక్టరీ కట్టేందుకు ముందుకు వస్తే తాను సహకరిస్తానన్నారు.. ఒకవేళ వేరే వారికి స్టీల్ ఫ్యాక్టరీ కట్టేందుకు అనుమతి ఇస్తే మాత్రం తాను పెట్టిన రూ.1350 కోట్ల పెట్టుబడిని వెనక్కి ఇవ్వాలని అన్నారు..