వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జగన్ తన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సమస్యలను వింటూ.. తానున్నానని వారిలో భరోసాను నింపుతూ.. సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
see also:వైఎస్ జగన్ అంటే ఎనలేని అభిమానం..జొన్నలగడ్డ శ్రీనివాసరావు
ఇదిలా ఉండగా, జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్రపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే, ప్రజా సంకల్ప యాత్రను దృష్టిలో ఉంచుకున్న రాజకీయ విశ్లేషకులు, పలు ఎన్నికల సర్వే సంస్థలు సైతం త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో జగన్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
see also:వైఎస్ జగన్‌పై సోషల్ మీడియాలో వైరల్ న్యూస్..!
ఈ నేపథ్యంలో ఇవాళ వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారని, అంతేకాకుండా, సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలిపారు. ఏదేమైనా జగన్ చేస్తున్న ప్రజా సంకల్ప యాత్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గుండెల్లో దడ పుట్టిస్తోందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.