వరుస వివాదాలతో టాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. వివాదాస్పద నటి శ్రీరెడ్డి వివాదం నుంచి ఇప్పడిప్పుడే బయటపడుతున్న ఇండస్ట్రీకి అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్‌తో మరో దెబ్బ పడిన సంగతి తెలిసిందే . అయితే ఆ దెబ్బ ఇప్పుడు టీడీపీ మెడకు చుట్టుకుంటోంది. సెక్స్ రాకెట్‌తో ముడిపడ్డవారంతా టీడీపీకి సన్నిహితులు, అనుబంధ వ్యక్తులే కావడంతో కలకలం రేగుతోంది.
తెలుగుదేశం పార్టీలోని వ్యక్తులు, పార్టీలోని సన్నిహితులు అమెరికా సెక్స్ రాకెట్ నడుపుతున్నారని వైసీపీ పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ గత వారంలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయస్థాయిలో తెలుగువారి పరువు పోగొడుతున్నారని నిప్పులు చెరిగారు. ఇప్పుడు చూస్తే వాసిరెడ్డి పద్మ అన్నది నిజమే అని పిస్తుంది. తెలుగు తమ్ముళ్లు ఎఫ్‌బీఐ కేసును విచారిస్తుండడంతో తప్పించుకునే అవకాశం కూడా ఉండకపోవచ్చని ఆందోళన చెందుతున్నారు.
see also:మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రీ ఎంట్రీ ..!
ఇప్పటికే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడును నాలుగైదు సార్లు ఎఫ్‌బీఐ పోలీసులు విచారించారు.తెలుగు సంఘాల పెద్దలకు తెలియకుండా భారీ స్థాయిలో ఇంతకాలం పాటు సెక్స్ రాకెట్ జరిగే అవకాశమే లేదని ఎఫ్‌బీఐ గట్టిగా నమ్ముతోంది. పది మంది హీరోయిన్లను తెలుగు సంఘాల కార్యక్రమాల పేరుతో రప్పించి వ్యభిచారం నిర్వహించినట్టు విచారణలో తేలింది. కిషన్ దంపతులను ముందు పెట్టి పెద్దలే ఈ తతంగం నడిపినట్టు భావిస్తున్నారు. సెక్స్ రాకెట్‌ను బయటపెట్టిన డైరీలో ఏపీలో అత్యంత కీలకమైన శాఖను నిర్వహిస్తున్న ఒక మంత్రి పేరు కూడా ఉందని చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడైన ఒక ఎంపీ పేరు కూడా సెక్స్ రాకెట్ డైరీలో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. చూడలి మరి ఎవరి.. ఎవరి పేర్లు బయటకు చెబుతారో.
see also:ఇది టీడీపీకే కాదు అన్ని పార్టీలకు షాక్ న్యూస్..వైసీపీ ఎంపీగా పోటికి దిగుతున్న దగ్గుబాటి పురంధేశ్వరి