ఎన్టీఆర్ బయోపిక్, ఎన్టీఆర్‌కు సంబంధించి సంచలన అప్‌డేట్. రకరకాల అవాంతరాలతో కాస్త లేటవుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన పరిణామం చోటుచేసుకుందట. ఈ సినిమాలో ప్రిన్స్ మహేష్‌బాబు నటించబోతున్నట్టుగా ఫిల్మ్‌నగర్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో మహేష్ చేయబోయే పాత్ర ఎవరిదో కాదు.. ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పాత్ర అని సమాచారం.
see also:కేవలం.. డబ్బుల కోసమే ఆ పని చేశా..!
ఎన్టీఆర్ పాత్లరో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాలో ఏఎన్ఆర్, కృష్ణల పాత్ర ఉండటం తప్పనిసరిగా కనిపిస్తోంఇ. నాటి టాలీవుడ్ లెజండరీల పాత్రల కోసం వారి వారి వారసులనే ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యను ఎంపిక చేసుకున్నారట. అయితే, ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన మహానటి చిత్రంలో నాగచైతన్య ఏఎన్ఆర్‌గా నటించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ పాత్ర కోసం మహేష్‌బాబును సంప్రదించారట బాలకృష్ణ. స్వయంగా బాలకృష్ణ వచ్చి అడిగే సరికి మహేష్‌బాబు కాదనలేక.. నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.
see also:కూతురి కోసం సైరాను పక్కన పెట్టేసిన మెగాస్టార్..!