తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ మహానగరంలోని రాజేంద్రనగర్ నియోజక వర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.ఇవాళ వంద కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, సబ్ స్టేషన్లు, కిస్మత్‌పూర్‌లో నూతనంగా నిర్మించనున్న బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు.
see also:ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తరువాత బుద్వేల్, కిస్మత్‌పుర రూపు రేఖలు మారిపోతయని అన్నారు . రానున్న రోజుల్లో బుద్వేల్, కిస్మత్‌పూర్ మధ్య 28 ఐటీ కంపెనీలు రాబోతున్నాయన్నారు రూ.100 కోట్లతో గండిపేటను అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతమన్నారు. రూ.1600 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు.
see also:తెలంగాణ పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్..!
తెలంగాణ నేలను సస్యశ్యామలం చేయటం కోసం వేగంగా ప్రాజెక్టు పనులను చేపడుతున్నామని..పంటకు పెట్టుబడి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, 58 లక్షల మందికి పైగా అన్నదాతలకు రైతు బీమా కల్పిస్తున్నమని చెప్పారు. రాష్ట్రంలో 42 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని..గత పాలకులు పెన్షన్ల కోసం నానా గోసపెట్టారని మండిపడ్డారు.యాబై ఏళ్ల దరిద్రం నాలుగేళ్లలో పోవటం సాద్యం కాదని, దానికి కొంచెం టైం పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ సీ.నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.