తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగనున్న పంచాయితీ ఎన్నికలకు ఉమ్మడి హైకోర్టు బ్రేక్ వేసింది.ఈ క్రమంలో ప్రస్తుతం నెలకొన్న రిజర్వేషన్ల గందరగోళం తేలేదాక ఎన్నికలు జరపొద్దని కోర్టు ఆదేశించింది.అయితే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత దాసోజ్ శ్రవణ్ ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించాడు.
see also:దానం అనుచరులకు జీహెచ్ఎంసీ ఫైన్..!!
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు రాష్ట్ఱ ఏజీని రిజర్వేషన్లలో తేడాలు ఎందుకున్నాయి అని ప్రశ్నించింది.దీనికి సమాధానంగా ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదాలను వినిపిస్తూ మరో రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్నది అని తెలిపారు.అంతేకాకుండా ఇప్పటికే సర్పంచ్,వార్డు మెంబర్స్ పదవీ కాలం ముగిసిందని ఏజీ కోర్టుకు తెలిపారు..