అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి.ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా పని చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ మాజీ నేత కొణిజేటి రోశయ్యకు అత్యంత ప్రియ శిష్యుడు..దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మకమైన అనుచరుడుగా పని చేసిన ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్ శ్రీఘాకోళపు శివరామ సుబ్రహ్మణ్యం వైసీపీలో చేరనున్నారు.
see also:ఏపీ రాజకీయ పార్టీల భవిష్యత్ తేల్చేసిన గూగుల్ సర్వే..!
ఈ క్రమంలో ఇప్పటికే ఇటీవల జరిగిన కర్నూల్ జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిని కలిశారు సుబ్రహ్మణ్యం.
see also:
ఈ నేపథ్యంలో జగన్ అతనికి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జగన్.
see also:వైఎస్ జగన్ 199వ రోజు పాదయాత్ర..!
ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న జగన్ ను త్వరలోనే కల్సి ముహుర్తం ఖరారు చేసుకోని వైసీపీ కండువా కప్పుకోనున్నారు సుబ్రహ్మణ్యం..అయితే రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున అత్యధిక ఓట్లు సాధించిన అభ్యర్థిగా అప్పట్లో సుబ్రహ్మణ్యం చరిత్ర సృష్టించారు ..