తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ మరోసారి నియమాలకు ఎవరూ అతీతం కాదని చాటి చెప్పింది.ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర నేత,మాజీ మంత్రి దానం నాగేందర్ మొన్న ఆదివారం తన అనుచరులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్న సంగతి విదితమే.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
అయితే ఈ భారీ చేరిక సందర్భంగా మాజీ మంత్రి దానం నాగేందర్ అనుచరులు నగరం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ప్లెక్సీలు,బ్యానర్లను,భారీ ఎత్తున కటౌట్లు పెట్టారు.అయితే నగరంలో బ్యానర్లు,ప్లెక్సీలు,కటౌట్లు పెట్టడం నిషేదం అనే సంగతి మరిచిపోయిన దానం అనుచరులకు జీహెచ్ఎంసీ భారీ జరిమానాను జీహెచ్ఎంసీ విధించింది.దీంతో నాగం ముఖ్య అనుచరులు అయిన నాగేంద్ర,మోహన్ రెడ్డిలకు ఒక్కొక్కరికి రూ.పదిహేను వేల చొప్పున మొత్తం ముప్పై వేల రూపాయలను జరిమానా విధించి చట్టం ముందు అందరూ
సమానమే అని నిరూపించింది..