వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం పదో జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునే క్రమంలో జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటి వరకు జగన్ పాదయాత్ర చేసుకుంటూ వెళ్లిన ప్రాంతాల్లోని ప్రజలు.. వారి వారి సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారికి తానున్నానంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో 2019 ఎన్నికల ఫలితాలు వన్‌సైడ్ కానున్నాయా..? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంతకీ ఆ నిర్ణయమేంటో తెలుసుకుందాం. ఇక అసలు విషజ్ఞానికొస్తే. ఈ నెలాఖరులోగా వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా విశాఖ జిల్లాలోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయని, దానికి కారణం, ఇతర పార్టీల సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విశాఖ కేంద్రంగా జగన్ నిర్వహించబోయే ప్రజా సంకల్ప యాత్ర సభలో నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి, మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, కోండ్రు మురళీ, వివాఖ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ ఘనీ, పలువురు ముఖ్య నేతలు వైసీపీలో చేరబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే వీరంతా వైసీపీ నేతలతో మంతనాలు జరిపారని, జగన్ విశాఖలోకి ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం.. వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సందర్భంలోనే వైఎస్ జగన్ రాజకీయ ప్రత్యర్థులకు ఊహించని సవాల్ చేయనున్నారట.