తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ ప్రవేశ పెడుతున్న పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులూ ,కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్ఎస్ పార్టీ లో చేరుతున్నారు.
అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గంపా నాగేందర్ మరియు ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి అధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరియు నిజామాబాద్ ఎంపీ కవిత సమక్షంలో 2000 మంది రైస్ మిల్లర్లు టీఆర్ఎస్ పార్టీ లో మధ్యాహ్నం ౩ గంటలకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో చేరనున్నారు.