ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తేనే ప్రజలకు మంచి చేసిన వారమవుతామని ఇతర పార్టీల నేతలు ఆలోచన చేస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి, రైస్ మిల్లర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంపా నాగేందర్ లతో పాటు వారి అనుచరులు, 31 జిల్లాలకు చెందిన రైస్ మిల్లర్ల సంఘం బాధ్యులు మంత్రి కేటీఆర్, ఎంపి కవితల సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. వీరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
see also:బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!
ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యకమాలను అమలు చేస్తున్న తీరును చూసి ఇతర పార్టీల వారు ఆకర్షితులయి టీఆర్ఎస్‌లో చేరుతున్నారని చెప్పారు. మూడు దశాబ్దాల పాటు ప్రజల కోసం పనిచేస్తున్న మోహన్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరడం మంచి పరిణామమన్నారు. ఆయన చేరిక సీఎం కేసీఆర్ ప్రజల పక్షాన నిలబడి పని చేస్తున్న తీరును నిదర్శనమన్నారు. సీఎం ఆలోచనకు ఆకర్శితులయిన మోహన్ రెడ్డి, బోదన్ నియోజక వర్గం, నిజామాబాద్ జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లోనూ ప్రశంసిస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చేరిక కార్యక్రమానికి రావాలనుకున్నారని, పని వత్తిడి వల్ల రాలేక పోయారని కవిత తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో మోహన్ రెడ్డి, గంపానాగేందర్‌లు పార్టీలో చేరారన్నారు. బోదన్ నియోజక వర్గాన్ని ఎమ్మెల్యే షకీల్ సమగ్రాభివృద్ధి చేస్తున్నారని, మోహన్ రెడ్డి చేరికతో టిఆర్ఎస్ పార్టీ కూడా బలపడుతుందన్నారు.
see also;పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం
తెలంగాణ ఏర్పడిన తరవాత లాభపడిన మొదటి జిల్లా నిజామాబాద్ జిల్లా అని ఎంపీ కవిత చెప్పారు. గత పాలకులు నిజాం సాగర్ కు వచ్చే సింగూరు జలాలను హైదరాబాద్‌కు మళ్లించారని, సీఎం కేసీఆర్ తిరిగి సింగూరు జలాలను నిజాంసాగర్‌కు కలిపారని తెలిపారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా లబ్దిపొందే జిల్లా కూడా నిజామాబాద్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజి 21 ద్వారా ఆయకట్టు డబుల్ అవుతుందని కవిత వివరించారు. సీఎం కేసీఆర్ గుండె ధైర్యం ఉన్న నాయకుడు కావడం వల్లే కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టు చేపట్టారని, ఇతర పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్లు కలలో కూడా ఇలాంటి ఆలోచన చేయలేరని కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు త్వరతగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం పనులను వేగవంతం చేసిందని ఎంపీ కవిత తెలిపారు.