మెట్రోరైలుకు అనుసంధానంగా మారుమూల ప్రాంతాల్లో రవాణ సౌకర్యాల మొరుగుదల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయాలని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను అదేశించారు. ఈరోజు మెట్రో రైల్ భవన్ లో జరిగిన సమావేశంలో రవాణ శాఖా మంత్రి మహేందర్ రెడ్డితో కలిసి వివిధ శాఖల అధికారులతో మెట్రో రైలు కనెక్టివిటీపైన సమీక్షించారు. మెట్రోరైలు పనులు త్వరలో పూర్తి కానున్న నేపథ్యంలో దీనికి అనుసంధానం చేస్తూ మారుమూల ప్రాంతాల నుంచి( లాస్ట్ మైల్ కనెక్టివీటీ) ఏర్పాటు చేయాల్సిన రవాణా సౌకర్యాల కల్పనలో రవాణ శాఖ, అర్టీసీ, సెట్విన్, మెట్రోరైలు సంస్ధ సమన్వయంతో ముందుకు పోవాలని సమావేశంలో మంత్రులు అధికారులను అదేశించారు. అయా శాఖల మద్య మరింత సమన్వయం కోసం, నగరంలో ప్రజా రవాణా వ్యవస్ధ మెరుగుదలకోసం తీసుకోవాల్సిన చర్యల కోసం, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
రవాణా శాఖ, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్ఎంఅర్ ఎండీ, సెట్విన్, జీహెచ్ఎంసీ, దక్షిణ మద్య రైల్వే సంస్ధల ప్రతినిధులు ఈ టాస్క్ ఫోర్సులో సభ్యులుగా ఉంటారు. నగరంలో ప్రజారవాణ వ్యవస్ధను మరింత బలోపేతం చేయడంతోపాటు నూతన పరిజ్ఝానాలతో చేపట్టాల్సిన చర్యలను సూచించాల్సిందిగా మంత్రులు ఈ టాస్క్ ఫోర్సును కోరారు. రెండు నెలల్లో ప్రాథమిక నివేధికతో ముందుకు రావాలని టాస్క్ ఫోర్సును మంత్రులు అదేశించారు. నగరంలోని రవాణా అవసరాలను తీర్చడంలో అర్టీసీ, మెట్రోరైలు సంస్ధలు పోటీతో కాకుండా పరస్పరం సహాకారంతో పనిచేస్తే ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్నారు. నగరంలో ప్రయాణీకుడి సౌకర్యమే లక్ష్యంగా ప్రజారవాణా సౌక్యాలుంటాయని, ఇంటి నుంచి మెట్రో స్టేషన్ కు, మెట్రో స్టేషన్ నుంచి కార్యాలయాలకు అనుగుణంగా ఏండ్ టూ ఏండ్ (పూర్తి స్ధాయి) రవాణా ఏర్పాటుపైన దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.
see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం
నగరంలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టాలన్నారు. లాస్ట్ మైలు కనెక్టివిటీ కోసం ప్రవేశ పెట్టే బస్సులు, వ్యానులు, అటోలన్నీ ఏలక్ర్టిక్ వాహానాలనే తీసుకోవాలన్నారు. వీటిని ప్రొత్సహించేందుకు నగరంలోని మెట్రో స్టేషన్లు, బస్సు డిపోల వద్ద చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపైన ఇప్పటి నుంచే దృష్టి సారించాలని మంత్రులు అదేశాలు జారీ చేశారు. మల్టీలెవల్ పార్కింగ్ సౌకర్యాలపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను మంత్రులు అదేశించారు. ఈ మల్టీ లెవల్ పార్కింగుల్లో అధునాతన టెక్నాలజీ, వివిధ దేశాల్లో పాటిస్తున్న విధానాలను ఇక్కడి పరిస్ధితులకు అనుగుణంగా ప్రవేశ పెట్టాలన్నారు.