తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ఓ విభిన్నమైన శైలిని రాజకీయ నాయకులు పలు సందర్భాల్లో చేసే విశ్లేషణ గురించి తెలిసే ఉంటుంది. కేసీఆర్ తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోరని…పైగా ఎంజాయ్ చేస్తుంటారని అదే సమయంలో…అవకాశం దొరికినప్పుడు సదరు వ్యక్తులను ఏ రేంజ్‌లో టార్గెట్ చేసేయాలో అలా చేస్తుంటారనేది ఆ విశ్లేషణ సారాంశం. అంతేకాకుండా తనను కెలికిన వారిని ఓ రేంజ్‌లో వాయించేస్తారనే సంగతి తెలిసిందే. అలా తాజాగా కేసీఆర్ నజర్ పడింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై. తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ తాజాగా టీఆర్ఎస్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలా కామెంట్లు చేస్తున్న టీజీ, ఆయన వెనుక ఉన్న చంద్రబాబుపై కౌంటర్ వేశారు.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
మాజీ మంత్రి దానం నాగేందర్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగేందర్‌కు ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మూడు నాలుగు సర్వేలు చేయించామని తెలిపిన కేసీఆర్ మరో మూడు నాలుగు రోజుల్లో మరో సర్వే విడుదల చేస్తామన్నారు. ఏ సర్వే అయినా టీఆర్‌ఎస్‌కు వందకుపైగా స్థానాలు గెలుస్తామని చెప్తోందని కేసీఆర్ పేర్కొంటూ ఇది కేవలం పనిచేసే సర్కారుకు దక్కుతున్న ఫలితమన్నారు. “ఏపీలో దమ్కీలు తప్ప పని ఏం జరగడం లేదు. మేం ఇంతోల్లం అంతోల్లం….మా అంత పెద్ద ఇది లేదన్నారు. తీరా చూస్తే ఏం చేయలేదు“ అని అన్నారు. కేంద్రంలో 7 శాతం మాత్రమే వృద్ధి నమోదయిందని, తెలంగాణలో 20% ఉందని అన్నారు. `దేశంలో ఏ రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ లేదు. దీనికి కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని పనిచేయాలి. లంచాలు తీసుకోకుండా పనిచేయాలి. కుంభకోణాలు చేయకుండా పనిచేయాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. వట్టిగా రాదు.“అని చంద్రబాబుపై పంచ్‌లు వేశారు.
see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం
రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కడతారని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. `పిచ్చి పిచ్చి పనులు చేస్తే తరిమికొట్టేందుకు జనం రెడీగా ఉన్నరు. ఆరునూరైనా సరే తెలంగాణ ప్రగతి చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఇప్పుడు ప్రగతిబాటలో ఉన్నాం, అనుకున్న తెలంగాణ సాధించుకుని, తలెత్తుకుని బతుకుతున్నాం. వందకుపైగా స్థానాల్లో 40, 50, 60 వేల ఓట్లకుపైగా మెజార్జీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తరు. మన నేతలు, ఎమ్మెల్యేలతో పోలిస్తే.. ప్రతిపక్ష పార్టీలు 20 నుంచి 40 శాతం వ్యత్యాసంలో ఉన్నరు. అభివృద్ధిని జీర్ణించుకోలేకుండా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రతి రంగంలో అభివృద్ధి జరుగుతుంది. చిల్లర రాజకీయాలతో అభివృద్ధి ఆగదు. మూర్ఖంగా మాట్లాడితే ఊరుకోం. ప్రజల్లో మా పాలనపై నమ్మకముంది. అవసరమైతే ప్రజల మధ్యకు ముందస్తుగానే పోదాం“ అంటూ ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అయ్యే సవాల్ విసిరారు.