ఆనాడు ఉద్యమంలో పాల్గొన్నది మన బతుకులు మార్చుకోవడానికి , మన , రాబోయే తరాల వారి భవిష్యత్తు చక్కదిద్దుకోవడానికి, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి .. అంతే కానీ కేసీఆర్ కోసమో , కవిత , కేటీఆర్ , హరీష్ రావు ల కోసమో చేయలేదు .. మన కోసం , మన బతుకులు బాగు చేసుకోవడానికి చేసాం ..ఉద్యమకారుడు అంటే నిస్వార్ధంగా , సమాజం కోసం ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పోరాటం చేసేవాడు .. మరి ఇప్పుడు ఉద్యమం లో పాల్గొన్నాం ,మేము ఉద్యమకారులం మాకు పదవులు ఎందుకు ఇవ్వడం లేదు అని కేసీఆర్ ని ప్రశ్నించడం ఎంతవరకు న్యాయం .. ఉద్యమం లో ప్రతి పల్లె , ఊరు , వాడ అందరు పాల్గొన్నారు , అందరికి పదవులు ఇవ్వడం ఎవరి వాళ్ళ కాదు ..
భారత స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్న ఉద్యమ కారులెవ్వరు ఉద్యమకారులమని పదవులు అడగలేదు .. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయంగా నిలదొక్కుకున్నవారే నాయకులూ అయ్యారు..
ఉద్యమకారుడికి దక్కాల్సింది గౌరవం , నాయకుడికి దక్కాల్సింది పదవి.. ప్రతీ ఉద్యమకారుడు నాయకుడు కాలేడు. రాజ్యాంగ పరమైన పదవులకు ప్రజలెప్పుడు నాయకుడి నే ఎన్నుకుంటారు . దీనికి నిలువెత్తు నిదర్శనం శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడమే . అలా ఎంతో మంది ఉద్యమకారులు ఓడిపోయారు .రాజకీయలలో ఎవరి వల్ల లాభమో వారికే సముచిత స్థానం దొరుకుతుంది .. ఒక వ్యక్తి కున్న సామాజిక , సాంఘిక , ప్రాంత , కుల , మత, ఆర్థిక , పలుకుబడి , నిజాయితీ , నిబద్దత లాంటి ఎన్నో అంశాలను బట్టి వరించేది పదవి ..ఉద్యమకారుడికి ఉండాల్సింది ఆవేశం , రాజకీయ నాయకుడికి ఉండాల్సిది లౌక్యం ..ఆవేశం తో రాజకీయం, లౌక్యం తో ఉద్యమం చేయలేము .తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్ని ప్రత్యేక పరిస్థితిలో ఆవేశం , లౌక్యం ప్రదర్శించాల్సిన ఆవశ్యకత ఏర్పడటం తో కెసిఆర్ గారు ఉద్యమ రాజకీయ పార్టీ నాయకుడిగా అవతరించారు .నాయకులూ కావాలనుకున్న ఉద్యమకారులు ముందు నాయకులూ గ రూపాంతరం చెంది అప్పుడు ఆ నాటి మీ ఉద్యమ పాత్ర , భాగస్వామ్యం మిమ్మల్ని మిగతా నాయకుల కంటే ముందు వరసలో నిలబెడుతుంది .
ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం సాధించడం తోనే మన శ్రమ కు తగ్గ ఫలితం దక్కింది .
ఆనాడు ఉద్యమకారులపై మదపుటేనుగుల్లా స్త్యరవిహారం చేసిన నాయకులూ ఇప్పుడు మన పార్టీ లో కలవడం ఉద్యమకారులకు రుచించకోపోవచ్చు .. కానీ ఈ మదపుటేనుగుల్ని కట్టడి చేసే కావడి మన కేసీఆర్ .ఆ నాటి మదపుటేనుగులన్నీ ఈ నాడు మన నాయకుడి చరిష్మా కి తోకముడిచి మనతో కలవడం శుభ పరిణామమే ..అప్పుడు ఉద్యమం కోసం గొంగళి పురుగు ను కూడా ముద్దాడినం , ఇప్పుడు కూడా ముద్దాడుతాం బంగారు తెలంగాణ కోసం…ఉద్యమ వ్యతిరేకులను సైతం బంగారు తెలంగాణ లో భాగస్వామ్యం చేయడం గొప్ప విషయం గ భావించాలి కానీ గుడ్డు మీద ఈకలు పీకడం మానండి .
-కాసర్ల నాగేందర్ రెడ్డి