వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ పాదయాత్ర ఇవాల్టికి 197 వ రోజుకి చేరుకుంది.ప్రస్తుతం జగన్ తూర్పు గోదావరి జిల్లాలో పదయ్త చేస్తున్నారు.ఈ సందర్భంగా జగన్ ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జగన్ తో పలువురు సెల్ఫీలు దిగారు. గెద్దాడలో పర్యటించిన జగన్, ఓ చిన్నారికి అక్షరాభ్యాసం కూడా చేశారు. ఆ చిన్నారితో పలకపై ‘వైఎస్’ అనే అక్షరాలను రాయించి దిద్దించారు. కాగా, జగన్ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్న విషయం తెలిసిందే.
