ఆయన ఎమ్మెల్యే. అందునా అధికార పార్టీకి చెందిన అతను.ఇంకా ఏమి..సెంట్రల్ ఏసీ..కాలు తీసి కింద పెట్టకుండా చూసుకునే యంత్రాంగం..ఇలా సకల భోగాలను అనుభవించవచ్చు.కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం ఏకంగా శ్మశానంలో అది కూడా రాత్రి నుండి తెల్లారేదాక ఒక్కరే పడుకున్నారు.ఏమి పిచ్చా ఎందుకు ఆయన ఆ విధంగా చేశారు అని అనుకుంటున్నారా.
అసలు విషయం ఏమిటంటే ఏపీలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అయిన నిమ్మల రామానాయుడు శ్మశానంలో పడుకున్నారు.అక్కడితో ఆగకుండా ఉదయాన్నే అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు.
ఎందుకు ఇలా చేశారని అడిగితే సదరు ఎమ్మెల్యే మాట్లాడుతూ “ఎనిమిది నెలల కిందట ఆ శ్మశానం అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయి.అయితే అది శ్మశానం కావడం..దెయ్యాలు ఉంటాయని పనిచేయడానికి ఎవరు ముందుకు రావడంలేదు.దీంతో వారిలో భయం పోగొట్టడానికి ఇలా చేశాను ఆయన వివరణ ఇచ్చారు.అయితే ఈ శ్మశానం అభివృద్ధికి ప్రభుత్వం మూడు కోట్ల రూపాయలను మంజూరు చేసింది..