సాధారణంగా తులసి చెట్టు అందరి ఇంట్లో ఉంటుంది.తులసి చెట్టును పూజిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం.అయితే తులసి ఆకుల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. తులసి ఆకులూ మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. శరీరానికి ఉత్తేజాన్ని, శక్తిని ఇస్తాయి. ఈ క్రమంలోనే రోజూ ఉదయాన్నే ఒక కప్పు తులసి ఆకుల టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
see also:ఒక వారంలో రెండు కంటే ఎక్కువ సార్లు శృంగారం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా
- శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, జ్వరం, దగ్గు వెంటనే తగ్గుతాయి.
- రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి.
- ఈ టీలో ఉండే పొటాషియం మెదడులో సెరోటినిన్ లెవల్స్ ను పెంచుతుంది. దీంతో డిప్రెషన్ తగ్గిపోతుంది.
- యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.
- రక్త సరఫరా మెరుగు పడుతుంది.
- బీపీ కంట్రోల్ అవుతుంది.
- గుండె సమస్యలు రావు.
- జీర్ణ సమస్యలు పోతాయి. గ్యాస్, అసిడిటీ ఉండవు. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
- కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.