తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది .ట్రాక్టర్ బోల్తాపడి 15 మంది మృతి చెందారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని వేములకొండ శివారు లక్ష్మీపురం వద్ద ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ట్రాక్టర్ అదుపు తప్పి మూసీ కాలువలో పడింది. ఈ ఘటనలో పదిహేను మంది మృతి చెందారు ప్రమాదం సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు ఈ వ్యవసాయ కూలీలు ఉపాధి పనుల కోసం వెళ్తున్నారు క్షతగాత్రులను భువనగిరి ఆసుపత్రికి తరలించారు.
see also:టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు
యాదాద్రి జిల్లా వలిగొండ మండలం నందనం గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడంతో పాటు అనేక మంది గాయపడడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని, సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.