నాలుగు పదుల వయసు దాటిన తరువాత ఆ టాలీవుడ్ భామకు పెళ్లి చేసుకోవాలనిపిచ్చింది. అనుకున్నదే తడవుగా నచ్చిన వరుడితో అతి త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. ఇంతకీ ఆ 43 ఏళ్ల బ్యూటీ ఎవరంటే..? గతంలో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ స్టేటస్‌ను అనుభవించిన నగ్మా. అవును, మీరు చదివింది నిజమే. నటి నగ్మా త్వరలో పెళ్లి చేసుకోబోతోంది.
అయితే, నటి నగ్మ కేవలం టాలీవుడ్‌లోనే కాకుండా, తమిళ, మళయాళ భాషల్లో కూడా మంచి నటిగా రాణించిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలతో సమానంగా పేరు తెచ్చుకుంది. ఎంతలా అంటే..? స‌్టార్ హీరో లేకపోయినా.. నగ్మా ఉంటే ఆ సినిమాను కొనేందుకు బయ్యర్లు ఆసక్తి చూపేంతలా అన్న మాట. కిల్లర్, ఘరానా మొగుడు, మేజర్ చంద్రకాంత్, వారసుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నగ్మా హీరోయిన్‌గా నటించింది. ఒకానొక సమయంలో కోలీవుడ్ నటుడు శరత్ కుమార్‌ను నటి నగ్మ పెళ్లి చేసుకోబోతోందంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే, శరత్ కుమార్‌ను నటి రాథిక పెళ్లి చేసుకోవడంతో ఆ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
అయితే, నటి నగ్మా తన కుటుంబ సభ్యులతో పెళ్లి ప్రస్థావన తీసుకువచ్చినట్టు సమాచారం. చెన్నై నగరానికి చెందిన ఓ బఢా వ్యాపార వేత్తను నటి నగ్మ పెళ్లి చేసుకోబోందని, ఆ వ్యాపారికి మలేషియా, సింగపూర్‌లలో వ్యాపార సంస్థలు న్నాయని సమాచారం.