తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్న సంగతి తెలిసిందే.శాంతి భద్రత విషయంలో రాష్ట్ర పొలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుంది.ఈ క్రమంలోనే విధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబర్చిన తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లో తెలంగాణలో పోలీస్ వెరిఫికేషన్ పూర్తి చేయడంతో ఈ గౌరవం లభించింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి. వేగవంతంగా పాస్‌పోర్టు వెరిఫికేషన్ పూర్తిచేస్తున్నందుకుగాను విదేశీ వ్యవహారాల మం త్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ను అభినందించింది. బెస్ట్ పోలీస్ వెరిఫికేషన్ అవార్డును తెలంగాణ వరుసగా మూడోసారి దక్కించుకోవడం విశేషం. ‘వెరీ ఫాస్ట్’ టెక్నాలజీ యాప్‌ను ఉపయోగించడంతో తెలంగాణ పోలీసులు ఈ లక్ష్యానికి చేరుకున్నారు.
