తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయి. ఆ వేధింపులను కళ్లారా చూశా, అనుభవించాను, ఆ వేధింపులను తాళలేకనే సినీ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చా. సినీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే మహిళా నటులకు క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉండకూడదనే పోరాడుతున్నా. క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు చరమగీతం పాడే వరకు నా పోరాటం కొనసాగుతుంది అంటూ ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది నటి మాధవీలత.
ఇంటర్వ్యూలో భాగంగా నటి మాధవీలత తన పొలిటికల్ ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది. తాను రాజీకాయాల్లోకి వస్తున్నానని చెప్పిన వెంటనే.. తనంటే గిట్టని వాళ్లంతా చెప్పకూడని పదాలను ఉపయోగిస్తూ కామెంట్లు చేశారని, ఆ కామెంట్లు చూసిన తనకు చాలా బాధ కలిగిందని చెప్పుకొచ్చింది.
ఇలా బాధపడితే.. నీవేమీ పొలిటికల్ లీడర్ అవుతావు..? అని మరికొందరు ప్రశ్నించారని చెప్పింది. ఏం నేను మనిషిని కాదా..? నాకు ఫీలింగ్స్ లేవా..? నాకు కన్నీళ్లు రావా..? ఇతరులు చదవని రీతిలో పదాలు ఉపయోగిస్తూ ఆ కామెంట్స్ చేశారని చెప్పింది. వారు గిల్లితే గిల్లించుకోవాల్నా..? రక్తం వచ్చేలా గిచ్చుతామంటారు..? ఆ తరువాత ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకూడదంటూ కామెంట్స్ పెడుతుంటారు.. వాటన్నిటినీ మేం భరించాల్నా..? అంటూ ప్రశ్నించింది మాధవీ లత.