తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇటీవల హత్యకు గురైన సిద్దిపేట కు చెందిన కార్ డ్రైవర్ రవీందర్ కుటుంబానికి మంత్రి హరీష్ రావు తన వ్యక్తిగతంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచారు. గతంలో సిద్దిపేట టీటీడీ కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయగా మరో లక్ష రూపాయలు ఈరోజు బాధిత కుటంబానికి అందజేసి.. మొత్తంగా 2లక్షలు ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించారు.ఈ సందర్భంగా వారికీ అండగా ఉంటానని మనోధైర్యాన్ని ఇచ్చి మరో సారి తన మానవత్వాన్ని చాటుకోవడం పట్ల పలువురు ప్రశంసిస్తున్నారు.