అర్జున్ రెడ్డి సినిమాతో నటుడు విజయ్ దేవరకొండ యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ క్రమంలోనే మరో ప్రేమకథా చిత్రంతో తెలుగు సినీ ప్రేక్షకులను ఆలరించడానికి విజయ్ రెడీ అవుతున్నాడు. పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘గీత గోవిందం’ . ఈ సినిమాలో ‘ఛలో’ సినిమా నటి రష్మిక మంథన కథానాయికగా నటిస్తోంది.
బన్నీ వాసు నిర్మాత. అల్లు అరవింద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించినఫస్ట్లుక్ను చిత్రయూనిట్ ఇవాళ విడుదల చేసింది. విజయ్ నేలపై కూర్చుని కాళ్లు గోడకు అడ్డంగా పెట్టుకుని ఉంటే, రష్మిక ఆయన కాళ్లపై దర్జాగా కూర్చుని నవ్వుతూ కనిపించింది. విజయ్ మాత్రం తన ప్రేయసిని చూసుకుని సంతోషపడుతున్నాడు.
‘నా కాళ్లు తిమ్మిరి ఎక్కినా.. నడుం నొప్పి వచ్చినా.. మీ బరువు, బాధ్యత ఎప్పుడూ నాదే మేడం’ అని నవ్వుతూ విజయ్ ఈ పోస్టర్‌ను ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంది.
Naa kaallu thimmiri ekkina,
Nadumu noppi lechina,
Mee baruvu badhyata eppudu naade madam#GeethaGovindam pic.twitter.com/mMnlEB9ver
— Vijay Deverakonda (@TheDeverakonda) June 23, 2018