ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు.
పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ పార్టీ నిర్మాణం పవన్ కళ్యాణ్ చేపట్టలేదు .అయితే తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించిన కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీలో చేరతారు అని వార్తలు వస్తున్నాయి .
అందులో భాగంగా అయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు . ఉమ్మడి ఏపీలో 2011 అసెంబ్లీ స్పీకర్ గా పనిచేసిన ఆయన 2004 నుండి గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు .రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన ఎన్నీకల్లొ ఆయన ఘోర పరాజయం పాలయ్యారు .ప్రస్తుతం పవన్ తో భేటీ కావడంతో ఆయన పార్టీ మారతారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి ..