కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సిద్దమైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దానం నాగేందర్ ఇవాళ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలు ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో బడుగుల కోసం తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని దానం నాగేందర్ అన్నారు.పథకాలతో పాటు పదవుల కేటాయింపు లో నూ ఇది స్పష్టం అవుతుందని అన్నారు.తాను ఏ పదవులకోసం వెళ్ళడం లేదని బలహీన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా టీ ఆర్ ఎస్ పార్టీ లో చేరబోతునట్లు తెలిపారు.గతంలో ఏ పార్టీ చేయని విధంగా.. టీఆర్‌ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కేసీఆర్ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. గొల్లకురుమలకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు.