బిగ్ బాస్ షో అనగానే రకరకాల కంట్రవర్సీలూ గొడవలే గుర్తుకు వస్తాయి..ఆడ , మగ అనే తేడా లేకుండా అపరిచితులతో కలిసి బిగ్ బాస్ హౌజ్ లో జరిగే హంగామా అంత ఆంత కాదు.. ఇక తమిళ బిగ్‌బాస్2 రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది.. హౌస్‌మేట్స్ మధ్య టాస్క్‌ల జోరు పెరిగింది.. హౌస్‌మేట్స్ జనని, ఐశ్వర్యల మధ్య లిప్‌లాక్ శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీ డైపర్లు వేసుకుని చిన్న పిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకుని మగాళ్లలాగా నటించారు. ఐశ్వర్య, రమ్య ట్విన్స్‌లాగా నటించి హౌస్‌మేట్స్ అడిగిన ప్రశ్నలకు ఒకరి తర్వాత ఒకరు సమాధానాలు చెప్పారు. ఎపిసోడ్ ప్రారంభంలో హౌస్‌మేట్స్ ఎంత ఉత్సాహంగా ఉన్నారో ముగింపుకు వచ్చేసరికి అంత బద్ధకంగా తయారయ్యారు. మొత్తానికి తమిళ్ బిగ్‌బాస్2 షో రోజురోజుకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తోంది. అంతకుమించి అనిపించేలా షో సాగిపోతోంది. కమల్‌హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో తమిళ టీవీ వీక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
