టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరి..రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే..తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే రాజీనామాలకు సైతం వెనుకాడబోమని అఖిల ప్రియ హెచ్చిరించినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇప్పటికి భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
దీంతో ఎవరో ఒకరు టీడీపీలో ఉండే అవకాశం ఉందని జిలా నేతలు అంటున్నారు. ఇక తాజాగా మంత్రి అఖిల ప్రియ అదే జిల్లాలోని మరో టీడీపీ ఎమ్మెల్యే మద్య విబేధాలు తారాస్థాయికి చేరాయి. గత కొంతకాలంగా బనగానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి మంత్రి అఖిల ప్రియ, ఎమ్మెల్యే భుమా బ్రహ్మనందరెడ్డిపై అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల వారిద్దరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కూడా ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సీఎం నివాసంలో నేడు మధ్యాహ్నం 2 గంటలకు కర్నూల్ జిల్లా నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలోపార్టీ బలోపేతంపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక అఖిల ప్రియ, జనార్థన్ రెడ్డి వ్యవహారంపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. గతంలో బీసీ జనార్థన్ రెడ్డి సీఎంను కలిసి తన బాధను వివరించినట్లు తెలిసింది. వారి మధ్య విభేదాల కారణంగా మహానాడు, మినీ మహానాడు, కర్నూలులో ముఖ్యమంత్రి టూర్కు సైతం జనార్థన్ రెడ్డి గైర్హాజరయిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ దెబ్బకు ..బీసీ జనార్ధన్ రెడ్డి..ఏవీ సుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పే అలోచలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.