టాలీవుడ్‌లో ప్రస్తుతం హీరోయిన్ల కొరత ఉన్నట్టు కనిపిస్తున్నా కొంత మంది హాట్ బ్యూటీలో ఆ కొరతను కవర్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య అతిధిరావ్ హైదరి పేరు టాలీవుడ్‌లో గట్టిగానే వినిపిస్తోంది. ఇటీవలె ఆమె నటించిన సమ్మోహనం సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆ సినిమా యూఎస్‌లో మంచి టాక్‌తో డాలర్స్‌ను రాబడుతోంది.
ఇక అసలు విషయానికొస్తే.. అతిధి హైదర్‌కు టాలీవుడ్‌లో లక్కీ ఆఫర్‌ను దక్కించుకున్నట్టు చిత్ర పురి కాలనీ వాసులు చర్చించుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్‌బాబు 25వ చిత్రం వంశీ పైడపల్లి దర్శకత్వంలో తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ చిత్రంలో ఓ పాత్ర కోసం అతిధిని ఫిక్స్ చేసినట్టు టాక్. ఇప్పటికే ఆ సినిమాలో పూజా హెగ్దే మెయిన్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. రీసెంట్‌గా షూటింగ్ కూడా ప్రారంభమైపోయింది. ఇందులో మరో పాత్ర కోసం అతిధి రావును సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, టాలీవుడ్‌లోని మరికొందరు స్టార్ హీరోలు సైతం అతిధిరావుపై కన్నేసినట్టు తెలుస్తోంది. మరి ఈ సమ్మోహనం పిల్ల ఎటువంటి క్రేజీ ప్రాజెక్స్ట్‌ను దక్కించుకుంటుందో చూడాలి.