ఇల్లందు నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆకస్మిక గుండెపోటుతో ఇవాళ ఆస్పత్రిలో చేరారు. ఉన్నట్టుండి కుప్పకూలిపోయిన ఆయనను కుటుంబ సభ్యులు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో చేర్పించారు.
నర్సయ్య గుండెలో మూడు వాల్వులు బ్లాక్ అయ్యాయని, ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలిసి ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ఈ వార్త తెలుసుకున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ,ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.