ఎన్నికల నాటికి ఏటూరునాగారంలో ఆర్టీసీ మినీ బస్ డిపో ఏర్పాటు చేయిస్తానని మంత్రి చందూలాల్ స్పష్టం చేశారు. ఆయన ఏటూరునాగారం సామాజిక వైద్యశాలకు రూ.7 కోట్లతో మంజూరైన మాతా, శిశు సంరక్షణా కేంద్ర భవనం పనులను గురువారం ప్రారంభించారు. సామాజిక వైద్యశాలల జిల్లా ఆరోగ్య సమన్వయకర్త డా.పి.గోపాల్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డయాలసిస్ కేంద్రం ములుగుతో పాటు ఏటూరునాగారానికి సైతం మంజూరైందని త్వరలో ఏటూరునాగారంలో కూడా రక్తశుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తామన్నారు. ఐటీడీఏ వెనక రోడ్డు ప్రాంతంలో రూ.2.60 కోట్లతో తారు రోడ్డు మంజూరైందని త్వరలో ఆ పనిని ప్రారంభిస్తామని తెలిపారు. వైద్యులు సైతం సేవా భావంతో సేవలందించాలని, అందుకు స్థానికంగా ఉండాలని సూచించారు. కన్నాయిగూడెం మండలానికి వెళ్లే రహదారి డబుల్ రోడ్డుగా మంజూరైందన్నారు. త్వరలో సంబంధిత పనికి టెండర్లు నిర్వహించనున్నట్లుగా చెప్పారు. ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, ములుగు ఆర్డీవో రమాదేవి, డీఎస్పీ రమణారెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రవీణ్‌చందర్ తదితరులు పాల్గొన్నారు.