ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ తాజాగా మరో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నసంగతి తెలిసిందే.అయితే ఈ విషయాన్నీ ఆమె స్వయంగా పలు టీవీ చానెల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కూడా చెప్పారు.ఈ క్రమంలోనే ఇటీవల రేణు దేశాయ్ ఓ వ్యక్తి చేయిపట్టుకుని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.అయితే మరోసారి తాజాగా ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో స్విమ్ డ్రెస్‌లో ఫోన్ చూస్తున్నప్పుడు తీసిన ఫొటోను రేణూ పోస్ట్ చేశారు. ఆ ఫొటోను తన స్నేహితులు తీశారట. అయితే ఆ సమయంలో తాను తనకు కాబోయే భర్త చేసే మెసేజ్‌లను చదువుతున్నానని, కానీ తన స్నేహితులు ఫొటోలు తీస్తూ తనకు ప్రైవసీ ఇవ్వడంలేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే త్వరలో రేణూ పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పకనే చెప్పారు. కాగా ప్రస్తుతం రేణూ తన పిల్లలు, స్నేహితులతో కలిసి గోవాలో విహరిస్తున్నారు.
