ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రాష్ట్ర విభజన తర్వాత జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేయనున్నారు .ఇదే విషయం గురించి ఇటివల రాష్ట్రానికి ప్రత్యేక హోదా
ఇవ్వాలని తన ఎంపీ పదవికి రాజీనామా చేసిన వైసీపీ నేత ,తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మద్దతు ఇస్తాను అని చెప్పారని ఆయన వెల్లడించాడు.గత సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడికి అనుభవం ఉండటం ..అవినీతి లేకుండా ప్రభుత్వాన్ని నడుపుతారని టీడీపీ పార్టీని నమ్మి మద్దతు ఇచ్చాను .
అయితే తను అనుకున్న రీతిలో పాలించడం పక్కనపెట్టి ..లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అని ..అందుకే పాలించడానికి అనుభవం కాదు ..ప్రజలకు న్యాయం చేయాలనే ఆశ అని ..అది జగన్ లో చూశాను .అందుకే తన మద్దతు అని ఆయన నాతొ చెప్పారు అని వరప్రసాద్ మీడియాకు తెలిపారు .ఏది ఏమైతే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి ప్రధాన కారణమైన జనసేన ఈ సారి ఎన్నికల్లో అదే పార్టీ ఓటమికి కారణం కావడం తధ్యం అని అర్ధమవుతుంది ..