ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా ..
అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన వ్యక్తిగత స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేయాల్సిన రాష్ట్రాభివృద్ధిని తాకట్టు పెట్టారని, కేంద్రం ఇవ్వాల్సిన మొత్తం 16500 కోట్ల సాయాన్ని వదలుకున్నారని ఆ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు ,మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
అంతే కాకుండా రాష్ట్ర అబివృద్ది ఆయనకు ముఖ్యం కాదని ఆయన అన్నారు. దుగరాజపట్నంలో పోర్టు నిర్మాణం సాధ్యం కాదని కేంద్రం చెబితే, ప్రత్యామ్నాయం చూపించలేదని ఆయన దుయ్యబట్టారు. ముందే ప్యాకేజీ మాట్లాడుకున్నారని, అందుకే సాధ్యం కాదని తెలిసినా ఇంకా మాట్లాడుతున్నరని ఆయన ఆరోపించారు.