ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అత్యంత నమ్మకమైన బంటు ..టీడీపీ పార్టీకి ఆర్థికంగా అండగా ఉండే సీనియర్ నేత ..ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వైఎస్సార్ కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలనీ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే .
అయితే సీఎం రమేష్ చేస్తున్న దీక్షను ఉద్దేశించి ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు .ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎంపీ సీఎం రమేష్ కు పిచ్చిపట్టి దీక్షలు చేస్తున్నాడు ..ఆయన దీక్ష చేస్తే ఉక్కు రాదు ..తుక్కు రాదు .
అసలు అయన చేస్తున్న దీక్షలో నీతి నిజాయితీ లేదు .మందులతో సాగుచేసిన తిండి తింటున్న వారిలో నిజాయితీ ఎలా ఉంటుందని ..ఆయన బాబు నాటకాలు డ్రామాలు ఆడుతూ
ఆయనతో దీక్ష చేయిస్తున్నాడు అని ఆయన ఫైర్ అయ్యారు .