24 డిమాండ్లతో సివిల్ సప్లై కార్పొరేషన్ లో పనిచేస్తున్న హమాలీలు సమ్మెకు దిగారు. వీరి డిమాండ్స్ పై మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ కమీషనర్ అకున్ సబర్వాల్ హమాలీ సంఘాలతో చర్చలు జరిపి కొన్నింటిపై నిర్ణయం తీసుకోగా.. ప్రధాన డిమాండ్ అయిన హమాలీ చార్జీలపై గురువారం సచివాలయంలో మంత్రి ఈటల , కమిషనర్ అకున్ సబర్వాల్ సంఘాలతో చర్చలు జరిపారు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు క్వింటాలుకు 8 రూపయలు ఉండగా రాష్ట్రము ఏర్పడగానే 12 రూపాయలకు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. జి ఓ నెంబర్ 26 ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకి ఒక సారి రేట్లుపెంచాలి ఇందులో భాగంగా 2016 లో దీనిని గ్రామీణ ప్రాంతాల్లో 15 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో 15.50 రూపాయలకు పెంచింది. పెరిగిన రెట్ల ప్రకారం 1 రూపాయ 23 పైసలు పెంచాల్సి ఉండగా… గత రెట్ల కంటే 3 రూపాయలు అదనంగా పెంచుతున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క క్వింటాకు 18రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 18.50 రూపాయలు హమాలీలకు అందనుంది. ఈ నిర్ణయం పట్ల హమాలీలు హర్షం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి ఈ ట ల కు వారు ధన్యవాదాలు తెలిపారు.
-హమాలీలు బట్టలు కుట్టించుకునేందుకు ఇచ్చే అలవెన్సు రూ.600కు పెంపు
-దసరాకు స్వీట్‌బాక్స్ కోసం రూ.700
-దసరా బోనస్ రూ.4 వేల నుంచి 4,500 పెంపు
-చనిపోయినవారి దహనసంస్కారాల కోసం ఇచ్చే ఖర్చు రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు
-1000 టన్నులకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న గోదాముల్లో నెలకు స్వీపర్స్‌కు రూ.2500, 500-1000 టన్నులు ఉంటే రూ.2000 ఇస్తారు.
స్వీపెర్స్ కి:
1000 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ సామర్ద్యం ఉన్న గోదాములకి 2500 రూపాయలు
500 TO 1000 మెట్రిక్ టన్నుల : నెలకు 2000 రూపాయలు
500 మెట్రిక్ టన్నుల కంటే తక్కువ ఉన్న గోదాము: 1500 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ఈ జీతాలతో వారు బ్రతకడం కష్టం అని వారికి మరింత వేతనం పెంచే విషయం పై ఆలోచించాలని కమిషనర్ ని మంత్రి ఆదేశించారు.