తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది.మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.. ఈ క్రమంలోనే అయన తన రాజీనామా లేఖ ను కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ కి మరియు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కూడా పంపారు.రేపు తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని అయన తెలిపారు.
అయితే ప్రస్తుతం అయన ఏ పార్టీ లో చేరుతారనే దాని పై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.కాగా గత కొన్ని రోజుల నుండి దానం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఉత్తమ్ కుమార్ పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత దానం కు సరైన ప్రాధ్యనత ఇవ్వడం లేదనే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దానం రాజీనామా చేసినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.