తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీపై కాలు దువ్వుతున్న కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాంక్ అయ్యే పరిణామం చోటుచేసుకుంది. ఆ పార్టీకి చెందిన ముఖ్యనేత, కాంగ్రెస్ నాయకుడు దానం నాగేందర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు రాహుల్‌కు లేఖ రాశారు. ఆయనతో పాటుగా నగరానికి చెందిన ఓ మంత్రితో పాటు పలువురు నేతలు సైతం కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం.
దానం రాజీనామా చేసిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే దానం ఆయనతో భేటీ అయ్యేందుకు నిరాకరించారు. మరోవైపు రేపు 12 గంటలకు దానం నాగేందర్ ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఫిలింనగర్, ఫిల్మ్జంక్షన్లో దానం నాగెందర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఏం మాట్లాడనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదిలాఉండగా..దానం సంచలనం నేపథ్యంలో దానం రాజీనామా నేపథ్యంలో జానారెడ్డి ఇంట్లో సీనియర్లు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.